Patnam Mahender Reddy : పట్నంకు గ్రాండ్ వెల్ కమ్
తొలిసారి మంత్రిగా ఎంట్రీ
Patnam Mahender Reddy : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా కొలువు తీరిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. ఆయన తొలిసారిగా తన సోదరుడు నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ లో కాలు మోపారు.
Patnam Mahender Reddy As a Minister
మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో భారీ ఎత్తున జనం సాదర స్వాగతం పలికారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, శ్రేణులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి(Patnam Mahender Reddy) మాట్లాడారు. తనకు మంత్రి పదవి కేటాయించినందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని అన్నారు.
ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. ఇదిలా ఉండగా ఆయన గతంలో కేసీఆర్ కేబినెట్ లో రాష్ట్ర మంత్రిగా పని చేశారు. పోయిన సారి ఎన్నికల్లో పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో తాండూరులో ఓటమి పాలయ్యారు. దీంతో కేబినెట్ లో చోటు దక్క లేదు.
కేసీఆర్ పట్నం మహేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో టికెట్ ఆశించారు. కానీ దక్కలేదు. తిరిగి రోహిత్ కే ఇచ్చారు. దీంతో ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చారు కేసీఆర్. పట్నం ఊహించని రీతిలో మంత్రి పదవి కట్టబెట్టారు.
Also Read : CM Biren Singh : మణిపూర్ లో హింసకు కాంగ్రెస్ కారణం