Congress Declaration : కాంగ్రెస్ ఎస్సీ..ఎస్టీ డిక్లరేషన్
ప్రకటించిన ఏఐసీసీ చీఫ్ ఖర్గే
Congress Declaration : తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. చేవెళ్ల లో ప్రజా గర్జన పేరుతో సభ చేపట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే హాజరయ్యారు. ఈ సందర్బంగా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించారు.
ఎస్సీలకు రిజర్వేషన్లను 18 శాతానికి పెంచుతామన్నారు. ఎస్సీ వర్గీకరణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంబేద్కర్ అభయ హస్తం ద్వారా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ. 12 లక్షల ఆర్థిక సాయం చేస్తామన్నారు.
Congress Declaration Viral
అన్ని ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు.
ఒక్కో కార్పొరేషన్‌కు ఏటా 750 కోట్ల రూపాయల నిధుల కేటాయిస్తామన్నారు ఖర్గే. ఇందిరమ్మ పక్కా ఇళ్లు పథకం ద్వారా ఇల్లు లేని ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.6 లక్షలు ఇస్తామన్నారు.
అసైన్డ్ భూముల పునరుద్ధరణ-సమాన హక్కులు – బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కున్న SC మరియు STల అసైన్డ్ భూములను లబ్దిదారులకు అందజేస్తామని చెప్పారు ఖర్గే. సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్(Congress) తీసుకొచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి అర్హులందరికీ పోడు భూమి పట్టాలు పంపిణీ చేస్తామన్నారు.
సమ్మక్క సారక్క గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం తీసుకు వచ్చామన్నారు. ఈ పథకం కింద ఒక్కో గూడెం, తండా గ్రామ పంచాయతీకి ఏటా రూ.25 లక్షలు కేటాయిస్తామన్నారు. మూడు ఎస్సీ కార్పొరేషన్ల ఏర్పాటు చేస్తామని తెలిపారు. మాదిగ, మాల, ఇతర ఎస్సీ ఉపకులాల కోసం కొత్తగా ఎస్సీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారను. ఒక్క కార్పొరేషన్‌కు ఏటా రూ.750 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
ఎస్టీల కోసం మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. తుకారాం ఆదివాసీ కార్పొరేషన్, సంత్ సేవాలాల్ లంబాడా కార్పొరేషన్, ఎరుకుల కార్పొరేషన్ స్థాపిస్తామన్నారు. ఒక్కో కార్పొరేషన్‌కు ఏటా రూ.500 కోట్ల నిధులు మంజూరు చేస్తామని తెలిపారు.
కొత్తగా ఐదు ఐటీడీఏలు, 9 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామన్నారు.
నల్గొండ, మహబూబాబాద్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్ మైదాన ప్రాంత ఎస్టీలకు ఐటీడీఏలు కల్పిస్తామన్నారు.
విద్యాజ్యోతి యోజన పథకం కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాల్గవ తరగతికి దాకా రూ.10,000, ఇంటర్ ఉత్తీర్ణత చెందిన వారికి రూ.15,000, గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత రూ.25,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత రూ.25,000. లక్ష, ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేసిన యువతులకు రూ.5 లక్షలు అందజేస్తామన్నారు.
విద్యా జ్యోతుల పథకం కింద ఎంఫిల్, పిహెచ్డి పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ యువతకు రూ. 5 లక్షలు అందజేస్తామని కాంగ్రెస్(Congress) ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించింది.
Also Read : Mallikarjun Kharge : ఎస్సీ,ఎస్టీల అభివృద్దే లక్ష్యం – ఖర్గే