Revanth Reddy : రేవంత్ రెడ్డి యూటర్న్
ఎస్టీ వర్గీకరణ ఊసెత్తని టీపీసీసీ చీఫ్
Revanth Reddy : ఒక్కోసారి ఎంతటి బలవంతమైన నాయకుడైనా ప్రజా బలం ముందు తల వంచక తప్పదు. ఈ మధ్యన తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ఆయా పార్టీలకు చెందిన నాయకులు తమకు తోచినట్లుగా మాట్లాడుతున్నారు. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ మరింత రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
Revanth Reddy Comments Viral
ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం కులం, మతం అన్నది ప్రధానంగా మారి పోయింది. తాజాగా ఆగస్టు 15న గాంధీ భవన్ సాక్షిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే ఇప్పటి వరకు ఎస్సీ వర్గీకరణ చేశారని, తాము పవర్ లోకి వస్తే ఎస్టీలలో కూడా వర్గీకరణ చేస్తామని ప్రకటించారు.
దీంతో రాష్ట్రంలోని ఎస్టీలలో అత్యధిక శాతం ఉన్న లంబాడీలు, గిరిజన బిడ్డలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. నువ్వు ఇలాగే గనుక కామెంట్స్ చేస్తే ఊరుకోమంటూ చెప్పారు. ఆపై తమ తండాలలో ఎలా తిరుగుతావో మేం చూస్తామంటూ మండిపడ్డారు.
దీంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఇవాళ చేవెళ్ల సభలో ఎస్టీ వర్గీకరణపై ఎలాంటి పేరు ఎత్తకుండానే రిజర్వేషన్ల గురించి మాత్రమే మాట్లాడారు . మొత్తంగా అణగారిన వర్గాలను తక్కువ అంచనా వేయడం మంచి పద్దతి కాదని తెలుసుకుంటే బెటర్.
Also Read : Congress Declaration : కాంగ్రెస్ ఎస్సీ..ఎస్టీ డిక్లరేషన్