Daggubati Purandeswari : ప్రధాని మోదీ రక్షా బంధన్ గిఫ్ట్
దగ్గుబాటి పురందేశ్వరి
Daggubati Purandeswari : ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. పీఎం అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గుది బండగా మారిన ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 200 తగ్గించింది.
Daggubati Purandeswari Said Thanks to Modi
ఈ నిర్ణయం దేశ వ్యాప్తంగా వెంటనే అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఇదిలా ఉండగా ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లక్షలాది మందికి ఉపయోగం కలుగుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు దగ్గుబాటి పురందేశ్వరి.
రూ. 200 తగ్గించడం వల్ల దాదాపు 33 మంది వినియోగదారులకు లబ్ది చేకూరుతుందని తెలిపారు. ప్రస్తుతం సిలిండర్ ధర రూ. 1,100గా ఉందని తగ్గింపు ధరతో రూ. 900కే వస్తుందని పేర్కొన్నారు. అంతే కాకుండా సుమారు 10 కోట్ల మంది ఉజ్వల లబ్ధిదారులు 700 రూపాయలకే సిలిండర్ అందుకుంటారని తెలిపారు.
ఈసారి అదనంగా 75 లక్షల కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని కూడా తమ సర్కార్ నిర్ణయించిందని పేర్కొన్నారు దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeswari). పీఎంయూవై కింద 10.35 కోట్లకు తీసుకు వెళుతుందని స్పష్టం చేశారు.
Also Read : Chandrababu Naidu Comment : బాబు ప్లాన్ సక్సెస్ అవుతుందా