ENC Chief : జగన్ ను కలిసిన ఈఎన్సీ చీఫ్
కీలక అంశాలపై చర్చలు
ENC Chief : సీఎం క్యాంపు ఆఫీసులో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తూర్పు నావికా దళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ కలిశారు. ఇటీవల ఈఎన్సీ చీఫ్‌గా రాజేష్ పెంధార్కర్(ENC Chief) బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా సీఎం జగన్ రాజేష్ పెంధార్కర్‌ను సన్మానించారు. ఆయనకు శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రతిమను అంద జేశారు.
ENC Chief Met CM YS Jagan
తూర్పు సముద్ర తీరంలో సముద్ర భద్రతకు సంబంధించి తలెత్తుతున్న సవాళ్లను సీఎంకు వివరించారు ఈఎన్సీ చీఫ్. తూర్పు నౌకాదళ కమాండ్ (ఈఎన్సీ) ఆధ్వర్యంలో వచ్చే ఫిబ్రవరిలో బహు పాక్షిక నావికా విన్యాసమైన మిలన్ 2024కు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనున్నట్లు రాజేష్ పెంధార్కర్ తెలిపారు.
57 దేశాల్లోని ప్రముఖుల, నౌకాదళాల భాగస్వామ్యం ఉంటుందని చెప్పారు. మిలన్ 2024 విశేషాలను, వైస్ అడ్మిరల్, అడ్మినిస్ట్రేషన్ అంశాలపై కూడా సీఎంతో చర్చించారు. సీఎం జగన్‌కు ఐఎన్‌ఎస్ విశాఖపట్నం షిప్ మోడల్‌ను రాజేష్ పెంధార్కర్ బహుకరించారు.
సీఎంని కలిసిన వారిలో నేవీ ఉన్నతాధికారులు కెప్టెన్ వీఎన్సీరావు , కెప్టెన్ రోహిత్ కట్టోజు, కమాండర్ వైకే కిషోర్, లెఫ్టినెంట్ సాయికృష్ణ తదితరులు ఉన్నారు.
Also Read : Daggubati Purandeswari : ప్రధాని మోదీ రక్షా బంధన్ గిఫ్ట్