Ponguleti Srinivas Reddy : తుమ్మలతో పొంగులేటి భేటీ
కాంగ్రెస్ లో చేరికపై నో క్లారిటీ
Ponguleti Srinivas Reddy : కాంగ్రెస్ పార్టీలో చేరుతారా లేదా అన్న దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. ఆయనను శనివారం కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరిన ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలుసుకున్నారు. పార్టీలోకి రావాలంటూ కోరారు. అయినా చేరే విషయంపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
Ponguleti Srinivas Reddy Meet Tummala Nageswara Rao
హస్తం పార్టీలోకి తనను ఆహ్వానించినందుకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి(Ponguleti Srinivas Reddy) ధన్యవాదాలు తెలిపారు. సీతారామ నుంచి గోదావరి జలాల విడుదలను చూడాలన్నదే తన కోరిక అని స్పష్టం చేశారు. ఆ ప్రాజెక్టు కోసమే తాను ఈసారి జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఏ పార్టీ నుంచి బరిలో ఉంటాననే దానిపై ఇంకా సస్పెన్స్ లో ఉంచారు.
కార్యకర్తలతో చర్చించి సరైన సమయంలో నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు తుమ్మల నాగేశ్వర్ రావు. గతంలో ఆయన టీడీపీలో మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత రాష్ట్ర ఏర్పాటు అయ్యాక బీఆర్ఎస్ లో చేరారు. ఈసారి ప్రకటించిన బీఆర్ఎస్ జాబితాలో తనకు చోటు దక్కలేదు. దీంతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా తుమ్మల ఇంటికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ కోరారు. ఆలోచిస్తానని హామీ ఇచ్చారు.
Also Read : Sajjala Ramakrishna Reddy : చంద్రబాబు నోరు విప్పాలి