Kane Williamson : కీవీస్ జట్టులో విలియమ్సన్
న్యూజిలాండ్ బోర్డు కన్ ఫర్మ్
Kane Williamson : కీవీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ భారత్ లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ టీమ్ లో చోటు దక్కించుకున్నాడు. 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఖరారు చేయనుంది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు. ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) లో భాగంగా కాలికి గాయమైంది. దీంతో హుటా హుటిన న్యూజిలాండ్ కు తరలించారు కేన్ విలియమ్సన్ ను.
Kane Williamson Viral
ఇప్పటి వరకు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ప్రధాన కోచ్ గ్యారీ స్టెడ్ ప్రకారం త్వరలోనే తమ వరల్డ్ కప్ టీమ్ లో కేన్ విలియమ్సన్ చేరుతాడని ప్రకటించాడు. ఈ మేరకు ఆశా భావం వ్యక్తం చేశాడు. కేన్(Kane Williamson) మామ రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా విలియమ్సన్ కు భారీ ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు.
ప్రత్యేకించి ఎలాంటి భేషజాలు లేకుండా చారిటీ కార్యక్రమాలకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే క్రికెటర్లలో కేన్ విలియమ్సన్ మొదటి వరుసలో ఉంటాడు. వరల్డ్ కప్ లో ఆడేందుకు ఇప్పటి నుంచే ఆరోగ్యంపై ఫోకస్ పెట్టాడని హెడ్ కోచ్ వెల్లడించాడు. అతడి లక్ష్యం ఒక్కటే ప్రపంచ కప్ లో ఆడాలని.
50 ఓవర్ల వన్డే ఫార్మాట్ లో అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడు కేన్ విలియమ్సన్. ఆయన పునరాగమనం జట్టుకు మరింత బలాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు.
Also Read : Rohit Sharma : బౌలింగ్ ఓకే ఫీల్డింగ్ దారుణం