Minister KTR : హైద‌రాబాద్ లో మ‌ల‌బార్ గ్రూప్ ఇన్వెస్ట్

ప్ర‌క‌టించిన ఐటీ మంత్రి కేటీఆర్

Minister KTR : దుబాయ్ – తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబ‌డుల వెల్లువ కొన‌సాగుతోంది. ప‌లు దిగ్గ‌జ కంపెనీలు ఇప్ప‌టికే హైద‌రాబాద్ ను ఎంచుకుంటున్నాయి. తాజాగా ఐటీ, పుర‌పాలిక శాఖ మంత్రి కేటీఆర్ సార‌థ్యంలోని బృందం ప్ర‌స్తుతం దుబాయ్ లో ప‌ర్య‌టిస్తోంది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌ముఖ కంపెనీల‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా పెద్ద ఎత్తున కంపెనీలు పెట్టుబ‌డులు పెట్టేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేశాయి. ఈ మేర‌కు ఒప్పందం చేసుకున్నాయి.

Minister KTR Said New Investment from Malabar

గోల్డ్ వ్యాపారంలో పేరు పొందిన మ‌ల‌బార్ గోల్డ్ సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు కేటీఆర్(Minister KTR) కు ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. 1,000 మందికి ప్ర‌త్య‌క్షంగా ఉపాధిని క‌ల్పిస్తూ తెలంగాణ‌లో రూ. 125 కోట్ల పెట్ట‌బడులు పెట్ట‌నున్న‌ట్లు మ‌ల‌బార్ గ్రూప్ ప్ర‌క‌టించింది.

ఇందులో భాగంగా మ‌ల‌బార్ గ్రూప్ సీనియ‌ర్ మేనేజ్ మెంట్ బృందం ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి టీంతో స‌మావేశ‌మైంది. ఇప్ప‌టికే తెలంగాణ‌లో గోల్డ్ రిఫైన‌రీ రంగంలో పెట్టుబ‌డులు పెట్టింది మ‌ల‌బార్ గ్రూప్. ఇత‌ర రంగాల‌లోనూ పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చింద‌ని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

ఈ మేర‌కు బుధ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ విష‌యాన్ని పంచుకున్నారు. రాష్ట్ర స‌ర్కార్ తీసుకుంటున్న సానుకూల నిర్ణ‌యాలే పెట్టుబ‌డులు వ‌చ్చేలా చేస్తున్నాయ‌ని పేర్కొన్నారు.

Also Read : Sandra Venkata Veeraiah : ‘సండ్ర’ సింప్లిసిటీకి జ‌నం ఫిదా

Leave A Reply

Your Email Id will not be published!