AP TDP Protest : ఆంధ్రప్రదేశ్ – టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ(TDP) ఆధ్వర్యంలో ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. పలు చోట్ల టీడీపీ శ్రేణులపై పోలీసులు దాడి చేశారు.
నల్ల జెండాలతో రోడ్లపై బైఠాయించారు. బస్సులు వెళ్లకుండా అడ్డుకున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ప్రజా ప్రతినిధులంతా రోడ్డుపైకి వచ్చారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
AP TDP Protest Viral
చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేయకున్నా కావాలని రాష్ట్ర సర్కార్ అరెస్ట్ చేసిందని ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు జగన్ రెడ్డిని ఛీ కొట్టడం ఖాయమని జోష్యం చెప్పారు.
తాము పవర్ లోకి రావడం ఖాయమని, జగన్ రెడ్డిని, ఆయన అనుచర మంత్రులు, ప్రజా ప్రతినిధులను శంకరగిరి మాన్యాలు పట్టిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది లేకుండా పోయిందన్నారు.
రాజారెడ్డి రాచరిక పాలన సాగుతోందన్నారు. ఎన్ని కేసులు బనాయించినా, ఇంకెన్ని దాడులు చేసినా, అరెస్టులు చేసినా తాము బెదిరే ప్రసక్తి లేదని హెచ్చరించారు.
Also Read : Minister KTR : ఏప్రిల్ లేదా మేలో అసెంబ్లీ ఎన్నికలు