IT Employees Protest : ఐటీ ఎంప్లాయిస్ ఆందోళన
చంద్రబాబు కోసం రోడ్డెక్కారు
IT Employees Protest : హైదరాబాద్ – తెలుగు రాష్ట్రాలలో తొలిసారిగా ఐటీ రంగానికి చెందిన ఉద్యోగులు ఒక రాజకీయ నాయకుడి కోసం రోడ్డెక్కడం. ఇది విస్తు పోయేలా చేసింది. హైదరాబాద్ మాదాపూర్ హైటెక్ సిటీలో కొలువు తీరిన విప్రో ఐటీ ఉద్యోగులు ఉన్నట్టుండి ఆందోళన బాట పట్టారు. ప్రధాన కారణం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అక్రమంగా టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు.
IT Employees Protest Viral
తీవ్ర నిరసన తెలిపారు. బాబు రావాలి బాబు కావాలి అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబును(Chandrababu Naidu) అక్రమంగా కేసులో ఇరికించారంటూ మండిపడ్డారు. ఏదో ఒక రోజు టీడీపీకి ప్రజలు అధికారం కట్టబెడతారని అప్పుడు జగన్ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు కోవాలని హెచ్చరించారు ఐటీ ఎంప్లాయిస్.
విప్రో సర్కిల్ లో పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులు బయటకు వచ్చారు. స్వచ్చంధంగా నిరసన చేపట్టారు. వీరంతా ఇలా బయటకు రావడం ఇదే మొదటిసారి. ఆర్థిక మాంద్యం నెలకొన్న తరుణంలో జాబ్స్ పోయినా ఆందోళన చేయని వీరంతా ఇప్పుడు నారా చంద్రబాబు కోసం నిరసన వ్యక్తం చేయడం విస్తు పోయేలా చేసింది. మొత్తంగా చంద్రబాబు రాజకీయం ఐటీకి కూడా పాకిందన్నమాట.
Also Read : Chandrababu Naidu : ఖైదీల ఆవేదన బాబుకు నివేదన