Pawan Kalyan : కలిసి నడుద్దాం పోరాడుదాం
పిలుపునిచ్చిన జనసేన చీఫ్ పవన్
Pawan Kalyan : రాజమండ్రి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని సంచలన ఆరోపణలు చేశారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రెచ్చి పోతున్నారని మండిపడ్డారు. జగన్ కు కేవలం ఇక ఆరు నెలలు మాత్రమేనని హెచ్చరించారు.
Pawan Kalyan Comments Viral
గురువారం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు నాయుడిని పరామర్శించారు. పవన్ కళ్యాణ్ తో పాటు నారా లోకేష్ , నందమూరి బాలకృష్ణ ముచ్చటించారు. ఈ సందర్బంగా చంద్రబాబు ఆరోగ్యం గురించి ఆరా తీశారు.
ఇక నుంచి రాష్ట్రంలో వైసీపీ సర్కార్ ను ఎదుర్కొనేందుకు ఉమ్మడిగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పోరాడుతాయని అన్నారు పవన్ కళ్యాణ్. జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటవుతామని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. ఇవాళ పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.
జగన్ ప్రత్యక్షంగా యుద్దానికి రావాలని కోరుకుంటున్నారని, తాము కూడా సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న మీడియాను కూడా జగన్ పట్టించు కోవడం మానేశాడని ధ్వజమెత్తారు. జగన్ మంచిగా పాలిస్తే తాము ఇక్కడ మాట్లాడాల్సి వచ్చేది కాదన్నారు.
రాబోయే ఎన్నికలకు సంబంధించి కాదన్నారు. జగన్ జైలులో ఉంటే తాను ఆనంద పడలేదన్నారు. చంద్రబాబు నాయుడుకు భద్రత ముఖ్యమన్నారు. ఆయన చాలా సమస్యలతో ఉన్నారని పేర్కొన్నారు. ఈ విషయం గురించి ప్రధాన మంత్రి మోదీకి, హోం శాఖ మంత్రి అమిత్ షా కు తెలియ చేస్తామన్నారు.
Also Read : Pawan Kalyan : జగన్ కరడు గట్టిన క్రిమినల్