Hamsa Vahanam : సింహ వాహనంపై శ్రీనివాసుడు
తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు
Hamsa Vahanam : తిరుమల – పుణ్యక్షేత్రమైన తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగ రంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సింహ వాహనంపై యోగ నరసింహుడి అలంకారంలో శ్రీ మలయప్ప స్వామి ఊరేగారు. యోగ నరసింహుడి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు.
Hamsa Vahanam in Tirumala
వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్త జన బృందాల భజనలు, కోలాటలు, జీయ్యంగా్ల ఘోష్టితో స్వామి వారిని కీర్తించారు. మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి వాహన సేవ కోలాహలంగా జరిగింది.
శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం సింహ వాహనాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి , ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతం అవుతాయి.
సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయ స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు.
ఇదిలా ఉండగా బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన చిన్నారులు తప్పిపోకుండా టీటీడీ(TTD) చైర్మన్ భూమన , ఈవో ధర్మా రెడ్డి జియో ట్యాగింగ్ కట్టారు.
Also Read : Mallikarjun Kharge : 2010లోనే మహిళా బిల్లు ఆమోదం