AP CM YS Jagan : దసరా నుంచి విశాఖ వేదికగా పాలన
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటన
AP CM YS Jagan : తాడేపల్లి గూడెం – ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ కేబినెట్ మీటింగ్ నిర్వహించారు. పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి వర్గానికి సూచన చేశారు.
రాబోయే విజయ దశమి (దసరా) పండుగ సందర్భంగా శుభవార్త చెప్పారు. జమ్మి పండుగ నాటి నుంచే విశాఖ పట్టణం కేంద్రంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పరిపాలన కొనసాగుతుందని స్పష్టం చేశారు ఏపీ సీఎం జగన్ రెడ్డి.
AP CM YS Jagan Shocking Decision
ఈ మేరకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న ప్రధాన ఆఫీసులను, ఇతర కార్యాలయాలను వెంటనే తరలించాలని సీఎస్ జవహర్ రెడ్డిని ఆదేశించారు సీఎం. అంతే కాకుండా త్వరితగిన ఆఫీసుల ఎంపికపై ఓ కమిటీని కూడా ఏర్పాటు చేయాలన్నారు జగన్ రెడ్డి.
ఇదిలా ఉండగా సీఎం చేసిన ప్రకటన కలకలం రేపింది. గతంలో జగన్ రెడ్డి(AP CM YS Jagan) ఇక్కడి నుంచే పాలన సాగిస్తారని టీటీడీ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి, వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ప్రకటించారు. మొత్తం మీద తాడేపల్లి గూడెం నుంచి కాకుండా ఇక నుంచి జగన్ రెడ్డి విశాఖ కేంద్రంగా పాలన సాగించనున్నారు.
Also Read : Sonia Gandhi : మహిళా బిల్లు రాజీవ్ కల – సోనియా