Koppula Harishwar Reddy : కొప్పుల హరీశ్వర్ రెడ్డి కన్నుమూత
మాజీ డిప్యూటీ స్పీకర్ మృతి పట్ల కేసీఆర్ సంతాపం
Koppula Harishwar Reddy : మాజీ డిప్యూటీ స్పీకర్, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్ రెడ్డి గుండె పోటుతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. మార్చి 18, 1947లో పరిగిలో పుట్టారు. ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.
కొప్పుల హరీశ్వర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో పేరు పొందిన రాజకీయ నాయకుడు. ఆయన పరిగి శాసనసభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. 10వ తరగతి వరకు చదువుకున్నారు. 1972 నుండి 1977 దాకా పరిగి ఉప సర్పంచ్ గా, 1977 నుండి 1983 దాకా సర్పంచ్ గా పని చేశారు.
Koppula Harishwar Reddy No More
అదే ఏడాది పరిగి నియోజకవర్గం నుండి పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అహ్మద్ షరీఫ్ చేతిలో కేవలం 56 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 1983లో టీడీపీలో చేరారు. 1985లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి షరీఫ్ పై 32, 512 ఓట్ల తేడాతో గెలుపొందారు.
1986 నుండి 1988 దాకా ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా , 1988 నుండి 1989 వరకు టీటీడీ సభ్యుడిగా పనిచేశారు. కొప్పుల హరీశ్వర్ రెడ్డి(Koppula Harishwar Reddy) 1994, 1999, 2004 , 2009లో పరిగి నియోజకవర్గం నుండి పోటీ చేసి వరుసగా శాసన సభ్యుడిగా గెలుపొందారు.
1997 నుండి 2003 దాకా రాష్ట్ర ఆర్థిక సంస్థ చైర్మన్ గా, డిసెంబర్ 31, 2001 నుండి నవంబర్ 14, 2003 దాకా ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా పని చేశారు.
నియోజకవర్గం నుండి పోటీ చేసి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1997 – 2003 వరకు రాష్ట్ర ఆర్ధిక సంస్థ అధ్యక్షుడిగా, 31 డిసెంబర్ 2001 నుండి 14 నవంబర్ 2003 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా పని చేశాడు.
తెలంగాణ ఉద్యమ సమయంలో నవంబర్ 15, 2012లో టీడీపీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరారు. 201లో ఓటమి పాలయ్యారు. అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ మృతి చెందారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు సీఎం కేసీఆర్.
Also Read : Chandra Babu Naidu Comment : కల చెదిరింది కథ మారింది