Kotha Manohar Reddy : రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేయాలి
బహిష్కృత నేత కొత్త మనోహర్ రెడ్డి
Kotha Manohar Reddy : హైదరాబాద్ – టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు మరోసారి బహిష్కృత కాంగ్రెస్ పార్టీ నేత కొత్త మనోహర్ రెడ్డి(Kotha Manohar Reddy). శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను చేసిన ఆరోపణలకు సంబంధించి పార్టీ పరంగా వివరణ కోరాలని, ఆ తర్వాత నిజమని తేలితే చర్యలు తీసుకోవాల్సింది పోయి తనపై వేటు వేస్తే ఎలా అని ప్రశ్నించారు. పార్టీ హైకమాండ్ ఈ విషయం తెలిసి కూడా ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలన్నారు కొత్త మనోహర్ రెడ్డి.
Kotha Manohar Reddy Comments on Revanth Reddy
ఒకవేళ రేవంత్ రెడ్డి గనుక ఎమ్మెల్యే టికెట్లను అమ్ముకోవడం లేదని అనుకుంటే లేదా నిరూపించు కోవాలని అనుకుంటే భాగ్యలక్ష్మి గుడి వద్ద ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే సీటు కోసం రూ. 10 కోట్లు , 5 ఎకరాలు తీసుకున్నాడని రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు మరోసారి.
ఇదే సమయలో రేవంత్ రెడ్డికి డబ్బులు ఎర చూపిన ఇదే నియోజకవర్గానికి చెందిన చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి ఇద్దరినీ కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు కొత్త మనోహర్ రెడ్డి.
గతంలో రూ. 25 కోట్లు తీసుకున్నాడని ఈటల రాజేందర్ ఆరోపణలు చేస్తే భాగ్యలక్ష్మి గుడి వద్ద ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఎందుకు రావడం లేదని , ప్రమాణం చేయడం లేదని ప్రశ్నించారు. రేవంత్ గనుక ప్రమాణం చేయక పోతే ప్రజలు రేవంత్ రెడ్డి సీట్లు అమ్ముకున్నట్లేనని డిసైడ్ చేస్తారన్నారు.
Also Read : Miniter KTR : ఎన్టీఆర్ పేరు ఉండటం అదృష్టం – కేటీఆర్