Tirumala Rush : పుణ్య క్షేత్రం భక్త జన సందోహం
భక్తుల రద్దీతో తిరుమల కిటకిట
Tirumala Rush : తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా శ్రీనివాసుడు కొలువైన తిరుమల భక్తుల రద్దీతో కిటకిట లాడుతోంది. నిన్న సెలవు రోజు కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగింది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది.
శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 88 వేల 623 మంది భక్తులు దర్శించుకున్నారు. 43 వేల 934 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు నిత్యం సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.57 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
Tirumala Rush With Devotees
ఇదిలా ఉండగా తిరుమల లోని 31 కంపార్టమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక ఎలాంటి సర్వ దర్శనం టోకెన్లు లేకుండా ఉన్న భక్తులకు దర్శన భాగ్యం కలిగేందుకు కనీసం 24 గంటలకు పైగా సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది.
మరో వైపు శ్రీవారి మెట్లు, అలిపిరి మెట్ల ద్వారా నడిచి వచ్చే భక్తులకు రక్షణాత్మకంగా ఉండేందుకు చేతి కర్రలను అందజేస్తున్నట్లు తెలిపారు టీటీడీ(TTD) ఈవో ఏవీ ధర్మారెడ్డి. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.
Also Read : BSP Resign : బీఎస్పీ చీఫ్ ఆర్సీపీకి బిగ్ షాక్