BRS WIN : హైదరాబాద్ – ప్రముఖ జాతీయ స్థాయి ఛానల్ టైమ్స్ నౌ సర్వే లోక్ సభ ఎన్నికలపై సర్వే చేపట్టింది. ఈ సర్వేలో ఊహించని రీతిలో ఫలితాలు వెల్లడి అయినట్లు పేర్కొంది సదరు చానల్. తెలంగాణలో భారత రాష్ట్ర సమితి పార్టీకి, బాస్ సీఎం కేసీఆర్ కు తిరుగే లేదని తేల్చి చెప్పింది.
BRS WIN Again One of the Channel Survey
బీఆర్ఎస్(BRS) దరి దాపుల్లో కూడా ప్రతిపక్ష పార్టీలు లేవని పేర్కొంది. తెలంగాణ ప్రజలు మరోసారి కేసీఆర్ వైపే ఉన్నారని కుండ బద్దలు కొట్టింది. అటు అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన హవాను కంటిన్యూ చేస్తుందని తేల్చి చెప్పింది.
అత్యధిక శాతం ప్రజలు గంప గుత్తగా బీఆర్ఎస్ పార్టీని నమ్ముతున్నారని, కేసీఆర్ సమర్థమంతమైన పాలన అందిస్తున్నాడని, ఆయనకు తిరుగే లేదంటూ తేల్చి చెప్పింది ఛానల్. గత కొంత కాలంగా కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు సైతం పోటీ ఇస్తాయని అనుకున్నా చివరకు గతంలో కంటే ఎక్కువగా ఈసారి సీట్లు కైవసం చేసుకుంటుందని బీఆర్ఎస్ పై స్పష్టం చేసింది టైమ్స్ నౌ సర్వే. దీంతో గులాబీ శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది.
Also Read : Telangana Elections : 32 స్థానాల్లో పోటీ చేయనున్న జనసేన