IT Raids : హైద‌రాబాద్ లో ఐటీ దాడులు

ప‌లు చోట్ల బృందాల సోదాలు

IT Raids : హైద‌రాబాద్ – తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న త‌రుణంలో ఉన్న‌ట్టుండి ఆదాయ ప‌న్ను శాఖ (ఐటీ) రంగంలోకి దిగడం క‌ల‌క‌లం రేపుతోంది. అధికారంలో ఉన్న భార‌త రాష్ట్ర స‌మితి పార్టీకి చెందిన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇళ్ల‌తో పాటు ఆయ‌న బంధువులు, స్నేహితులు, ఆఫీసుల‌పై మూకుమ్మ‌డిగా సోదాలు చేప‌ట్టారు.

IT Raids in Telangana Viral

మ‌రో వైపు గురువారం ఉద‌యం 6 గంట‌ల నుంచే ఐటీ బృందాలు హైద‌రాబాద్ న‌గ‌రాన్ని జ‌ల్లెడ ప‌ట్టాయి. దీంతో వ్యాపార‌వేత్త‌లు, ప్ర‌జా ప్ర‌తినిధులలో ఆందోళ‌న వ్య‌క్త‌మైంది. ఏక కాలంలో 100 ఐటీ బృందాలు(IT Raids) దిగ‌డం విస్తు పోయేలా చేసింది.

ప్ర‌ధానంగా చిట్ ఫండ్స్ , ఫైనాన్స్ కంపెనీలు , రియ‌ల్ట‌ర్లు ల‌క్ష్యంగా ఐటీ దాడులు చేస్తోంది. ఇందులో భాగంగా అమీర్ పేట్ , శంషా బాద్ , కూకట్ ప‌ల్లి, జూబ్లీ హిల్స్ , బంజారా హిల్స్ త‌దిత‌ర ప్రాంతాల‌లో జోరుగా దాడులు చేప‌ట్టారు.

ఒక్క పూజా కృష్ణ చిట్ ఫండ్స్ పై 20కి పైగా టీంలు సోదాలు చేప‌ట్ట‌డం విశేషం. ఫార్చూన్ విల్లాలో అరెక‌పూడి కోటేశ్వ‌ర్ రావు ఇంట్లో దాడులు చేప‌ట్టారు.

Also Read : Double Bed Room : డ‌బుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పంపిణీ

Leave A Reply

Your Email Id will not be published!