Telangana Govt : సమచారా శాఖలో కొలువుల భర్తీ
88 పోస్టుల భర్తీకి ఆదేశాలు జారీ
Telangana Govt : తెలంగాణ – తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గంలో సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ప్రత్యేక చొరవతో సంబంధిత శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు కీలక ప్రకటన వెలువడింది.
Telangana Govt Notification
రాష్ట్ర సమాచార శాఖలో మొత్తం 88 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్ర సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక సహాయ పౌర సంబంధాల శాఖ అధికారి, ఇద్దరు పబ్లిసిటీ అసిస్టెంట్ పోస్టులను కేటాయించింది. వీరిని ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అంతే కాకుండా హైదరాబాద్ సమాచార కమిషనరేట్ లో ఒక పబ్లిసిటీ అసిస్టెంట్ (ప్రచార సహాయకుడి) పోస్టును నియమిస్తారు. తెలంగాణ(Telangana) రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లవుతోంది. ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా సమాచార శాఖలో భర్తీ చేయక పోవడం విశేషం.
తన విన్నపాన్ని మన్నించి సీఎం కేసీఆర్ పోస్టుల భర్తీకి ఆమోద ముద్ర వేశారని తెలిపారు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి. అర్హత, అనుభవం కలిగిన జర్నలిస్టులకు, మీడియా పర్సన్స్ కు మంచి ఛాన్స్ అని చెప్పక తప్పదు.
Also Read : Nandikanti Sridhar : ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీధర్