CEC Vote From Home : వృద్దులు..దివ్యాంగులకు ఖుష్ కబర్
ఇంటి నుంచే ఓటు వేయొచ్చు
CEC Vote From Home : హైదరాబాద్ – కేంద్ర ఎన్నికల సంఘం సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు వయో భారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వృద్దులకు, వికలాంగులకు మేలు చేకూర్చేలా తీపి కబురు చెప్పింది. మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించించి కేంద్ర ఎన్నికల సంఘం బృందం. ఈ టీంకు చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్(Rajiv Kumar) కీలక ప్రకటన చేశారు.
CEC Vote From Home in Telangana
దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో సీనియర్ సిటిజన్లు , వికలాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి పోలింగ్ బూత్ వరకు రాలేని సీనియర్ సిటిజన్లతో పాటు 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఓటు వేసే ఛాన్స్ ఇస్తున్నట్లు తెలిపారు సీఈసీ రాజీవ్ కుమార్.
అంతే కాకుండా పోలింగ్ బూత్ వరకు వస్తామని చెబితే ఇంటి నుంచి బూత్ వరకు తీసుకు వస్తారు. తిరిగి ఓటు వేశాక ఇంటి వద్ద దింపుతారని వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన 5 రోజుల్లోగా 120 ఫారం కింద తమ వివరాలతో దరఖాస్తు చేయాలని సూచించారు రాజీవ్ కుమార్.
Also Read : Mohammad Azharuddin : అజారుద్దీన్ కు బిగ్ షాక్