Shashi Tharoor : మోదీ స‌ర్కార్ బేకార్ – శ‌శి థ‌రూర్

బీజేపీ సంకీర్ణ ప్ర‌భుత్వం వైఫ‌ల్యం

Shashi Tharoor : న్యూఢిల్లీ – మాజీ కేంద్ర మంత్రి, తిరువ‌నంత‌పురం కాంగ్రెస్ పార్టీ ఎంపీ , ర‌చ‌యిత‌, వ‌క్త శ‌శి థ‌రూర్ నిప్పులు చెరిగారు. గ‌తంలో ఎన్న‌డూ లేనంత తీవ్ర స్థాయిలో కేంద్రంలో కొలువు తీరిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, బీజేపీ సంకీర్ణ స‌ర్కార్ ను ఏకి పారేశారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. దేశంలో ప్ర‌తి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని చెప్పారు. కానీ మ‌రిచి పోయార‌ని మండిప‌డ్డారు. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా హింస పెరిగి పోయింద‌ని, సామాన్యుల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు శ‌శి థ‌రూర్.

Shashi Tharoor Slama Modi

రాబోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీకి గ‌డ్డు కాల‌మే మిగిలి ఉంద‌న్నారు. ఇవాళ దేశంలోని 5 ప్ర‌ముఖ రాష్ట్రాల‌లో శాస‌న‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ ఖ‌రారు చేసింద‌న్నారు. ఈ ఎన్నిక‌లలో వ‌చ్చే ఫ‌లితాలు రాబోయే ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం త‌ప్ప‌క చూపుతుంద‌న్నారు.

ద్ర‌వ్యోల్బ‌ణం, నిరుద్యోగం ప్ర‌ధాన అవ‌రోధాలుగా ఉన్నాయ‌ని పేర్కొన్నారు ఎంపీ శ‌శి థ‌రూర్(Shashi Tharoor). అత్యంత దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని వాపోయారు. ఈ దేశంలో ఎక్కువ‌గా మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ఉన్నారు. వారు పూర్తిగా వ్య‌వ‌సాయంపై ఆధార‌ప‌డి జీవిస్తున్నార‌ని తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో ఏం జ‌రుగుతుందో మోదీకి తెలుస‌ని తాను అనుకోవ‌డం లేద‌న్నారు శ‌శి థ‌రూర్.

Also Read : Election Code : ఎన్నిక‌లు ముగిసే దాకా 144 సెక్ష‌న్

Leave A Reply

Your Email Id will not be published!