Minister KTR : ఆందోళనలు చేస్తామంటే ఒప్పుకోం
స్పష్టం చేసిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
Minister KTR : హైదరాబాద్ – ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలుగుదేశం పార్టీతో పాటు ఇతర పార్టీలు ఎవరైనా సరే తమ రాజకీయ ప్రయోజనాల కోసం హైదరాబాద్ లో ఆందోళనలు, రాస్తారోకోలు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేస్తామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
Minister KTR Comments Viral
ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్(Minister KTR) స్పందించారు. ప్రస్తుతం ప్రపంచంలోని దిగ్గజ సంస్థలన్నీ భారత దేశానికి సంబంధించి ఒక్క హైదరాబాద్ ను మాత్రమే ఎంచుకుంటున్నాయని తెలిపారు. దీనికి ప్రధాన కారణం లా అండ్ ఆర్డర్ అదుపులో ఉండడమేనని పేర్కొన్నారు.
గతంలో కాంగ్రెస్ సర్కార్ హయాంలో నిత్యం అల్లర్లు, అశాంతికి కేరాఫ్ గా ఈ నగరం ఉండేదని గుర్తు చేశారు. ఇదిలా ఉండగా నారా లోకేష్ కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడి ఆరోగ్యం గురించి ఆయన తనయుడు నారా లోకేష్ చేసిన ట్వీట్ బాధ కలిగించిందని పేర్కొన్నారు.
కుమారుడిగా తండ్రి గురించి ఆందోళన ఎలా ఉంటుందో తనకు తెలుసని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. కేసీఆర్ ఆనాడు నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో తాను కూడా ఇలాగే ఆందోళనకు గురైనట్లు తెలిపారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలనే తాను టీడీపీ ఆందోళనలను ఒప్పుకోలేదని కుండ బద్దలు కొట్టారు.
Also Read : Tirumala Hundi : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.08 కోట్లు