Indra Keeladri : బాలాత్రిపుర సుందరి దేవీగా దుర్గమ్మ
ఘనంగా నవరాత్రి ఉత్సవాలు షురూ
Indra Keeladri : విజయవాడ – బెజవాడలోని ఇంద్రకీలాద్రి కొండపై కొలువు తీరిన కనకదుర్గమ్మ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా తొలి రోజున అమ్మ వారు బాలా త్రిపుర సుందరీ దేవీగా దర్శనం ఇచ్చారు భక్తులకు.
Indra Keeladri Navratri Updates
ఉత్సవాలను పురస్కరించుకుని భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు అమ్మ వారి దర్శనం కోసం. శ్రీ కనక దుర్గమ్మ(Sri Kanaka Durga) ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. శరన్నవరాత్రుల్లో ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
తొలి రోజు ఆశ్వయుజ శుద్ద పాఢ్యమిన జగన్మాత కనక దుర్గమ్మ బాలా త్రిపుర సుందరీ దేవీగా దర్శనం ఇచ్చారు. మనస్సు, బుద్ధి, చిత్తం ఈ దేవి ఆధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో ఉండే ఈ తల్లి అనుగ్రహం కోసం ఉపాసకులు బాలార్చన చేస్తారు.
ఈ రోజున రెండు నుంచి పదేళ్ల లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి.. పూజించి కొత్త బట్టలు పెడతారు. అమ్మ వారికి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగు చీరలు కట్టి పాయసం, గారెలను నైవేద్యంగా నివేదిస్తారు.
రోజుకు లక్షన్నర మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి వెల్లడించారు. ఈ మేరకు నిమిషానికి ఇద్దరు భక్తులు చొప్పున దర్శనానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
Also Read : Chandra Babu Security Comment : చంద్రబాబు భద్రమేనా..?