Congress Seniors : సీనియర్ల టికెట్లపై ఉత్కంఠ
మధు యాష్కి..బాలరాం, షట్కార్లకు నో ఛాన్స్
Congress Seniors : హైదరాబాద్ – తెలంగాణ కాంగ్రెస్(Congress) పార్టీలో ఇంకా టికెట్ల పంచాయతీ కొలిక్కి రాలేదు. మొత్తం రాష్ట్రంలో 119 సీట్లకు గాను 55 సీట్లను ఖరారు చేసింది. ఈ మేరకు తొలి విడత జాబితాను ప్రకటించింది.
ఇందులో 17 మంది రెడ్లకు కేటాయించింది సీట్లను. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతోంది. అత్యధిక జనాభా కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సరైన ప్రాధాన్యత లభించక పోవడాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు.
Congress Seniors Issues
మరో వైపు గాంధీ భవన్ లో మాజీ ఎంపీ, సీనియర్ నాయకుడు మల్లు రవి ప్రెస్ మీట్ ను అడ్డుకున్నారు మైనార్టీ నేతలు. పార్టీకి, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇదిలా ఉండగా తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకమైన పాత్ర పోషించిన మాజీ ఎంపీలు మధు యాష్కి గౌడ్ , పొన్నం ప్రభాకర్ , బల రాం నాయక్ , సురేష్ షెట్కర్ లకు ఇంకా సీట్లు కేటాయించక పోవడం ఒకింత పార్టీ శ్రేణులను విస్తు పోయేలా చేసింది.
మరో వైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. టికెట్లు అమ్ముకున్నాడని ఆరోపించారు. ఒంటెద్దు పోకడ పోతున్నాడని, పార్టీని సర్వ నాశనం చేశాడని ఆరోపించారు. అంతే కాదు స్వంత నిర్ణయాలతో సీనియర్ నేతలను, హైకమాండ్ ను తప్పుదోవ పట్టిస్తున్నాడని మండిపడ్డారు.
Also Read : YS Sharmila Slams : మోసానికి చిరునామా కేసీఆర్ పాలన