Nadendla Manohar : ఇన్ఫోసిస్ తో జగన్ కు ఏం సంబంధం
నిప్పులు చెరిగిన నాదెండ్ల మనోహర్
Nadendla Manohar : మంగళగిరి – జనసేన పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ట్విట్టర్ వేదికగా మంగళవారం స్పందించారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Nadendla Manohar Slams AP CM YS Jagan
తన పాలనలో ఎన్ని పరిశ్రమలను ఏపీకి తీసుకు వచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖపట్టణంలో ఏం ఒరగ బెట్టారని ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ఓపెన్ చేశారంటూ ప్రశ్నించారు. అసలు సీఎంకు ఇన్ఫోసిస్ కు ఏం సంబంధం అంటూ నిలదీశారు.
గతంలో కరోనా సమయంలో ఇంటి వద్ద నుండే చాలా మంది ఐటీ ఉద్యోగులు పని చేశారని , దీని కారణంగా ఇన్ఫోసిస్ సంస్థ భవనాన్ని నిర్మించ లేదని అన్నారు. తాజాగా ఆ భవనానికి తామే రూపకర్తలైనట్లు సీఎం జగన్ రెడ్డి, కోడిగుడ్ల మంత్రి గుడివాడ అమర్ నాథ్ లు ఓపెనింగ్ చేయడం విస్తు పోయేలా చేసిందన్నారు.
రాష్ట్రంలో పాలన గాడి తప్పిందన్నారు. మూడు రాజధానులు చేస్తానని ప్రగల్భాలు పలికన జగన్ రెడ్డి ఇప్పుడు విశాఖనే రాష్ట్రానికి రాజధాని అంటున్నారని, కల్లబొల్లి కబుర్లతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తున్నాడంటూ ఆరోపించారు నాదెండ్ల మనోహర్. ఎన్ని ఉద్యోగాలు ఇన్ఫోసిస్ ఇచ్చిందో సీఎం చెప్పాలని కోరారు .
Also Read : Asaduddin Owaisi : బీఆర్ఎస్ కు ఓటు వేయండి – ఓవైసీ