Mission Chanakya : తెలంగాణలో గులాబీదే జెండా
మిషన్ చాణక్య వెల్లడి
Mission Chanakya : తెలంగాణ – త్వరలో వచ్చే నెల నవంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు సర్వే సంస్థలు తమకు తోచిన విధంగా సర్వేల ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం రెండు సార్లు గెలుపొందింది బీఆర్ఎస్ పార్టీ. తాజాగా ముచ్చటగా మూడోసారి పవర్ లోకి రావాలని అనుకుంటోంది.
Mission Chanakya Survey Viral
ఇండియా టుడే సీ ఓటర్ సర్వే సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ పార్టీనేంటూ ప్రకటించింది. ఏకంగా ఆ పార్టీకి 54 సీట్లు వస్తాయని, అధికారంలో ఉన్న గులాబీ పార్టీకి 49 సీట్లు మాత్రమే వస్తాయని వెల్లడించింది.
తాజాగా ప్రముఖ సర్వే సంస్థ ఫౌండర్ డైరెక్టర్ శివ కేషవ్ సారథ్యంలోని మిషన్ చాణక్య కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో రాబోయే సర్కార్ గులాబీనేనని పేర్కొంది. బీఆర్ఎస్(BRS) కు 44.62 శాతం ఓట్లను సాధిస్తుందని, కాంగ్రెస్ పార్టీకి 32.71 శాతం వస్తుందని, బీజేపీకి 17.6 శాతం ఓట్లను కైవసం చేసుకుంటాయని వెల్లడించింది. దీంతో గులాబీ నేతలు, శ్రేణుల్లో తెగ సంతోషం వ్యక్తం అవుతోంది.
Also Read : Jogi Ramesh : చంద్రబాబు గజదొంగ