Nara Bhuvaneshwari : శ్రీవారి సన్నిధిలో భువనేశ్వరి
నిజం గెలవాలి పేరుతో యాత్ర
Nara Bhuvaneshwari : తిరుమల – టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం పుణ్య క్షేత్రం తిరుమలను సందర్శించారు. ఈ సందర్బంగా శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకున్నారు.
Nara Bhuvaneshwari in Tirumala
ఆమె రేపు అక్టోబర్ 25 నుంచి నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. టీడీపీ జాతీయ చీఫ్, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడంతో తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను స్వయంగా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) పరామర్శించనున్నారు.
ఇందులో భాగంగా ఇవాళ పుణ్య క్షేత్రాన్ని సందర్శించుకున్నారు. ఇదిలా ఉండగా ఏపీ స్కిల్ స్కాం కేసులో ఏపీ సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేసింది. రూ. 371 కోట్ల స్కాంకు పాల్పడ్డాడని, డబ్బులను హవాలా రూపంలో మారాయంటూ ఆరోపించింది. ఈ మేరకు నివేదిక సమర్పించింది.
విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. నవంబర్ 1 వరకు ఆయన రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే చంద్రబాబు కు కోలుకోలేని షాక్ తగిలింది. ఇటు ఏసీబీ కోర్టుతో పాటు హైకోర్టు, సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్లపై విచారణలు వాయిదా పడుతూ వచ్చాయి. ఆయన తరపు పేరొందిన లాయర్లు వాదించినా ఫలితం లేకుండా పోయింది.
Also Read : Afghan Team Win : పాక్ పై విజయం ఆఫ్గాన్ ఆనందం