Kasani Jnaneswar : తెలంగాణ ఎన్నికల బరిలో టీడీపీ
ప్రకటించిన ఆ పార్టీ చీఫ్ కాసాని
Kasani Jnaneswar : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు ఆ పార్టీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్(Kasani Jnaneswar). మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ పోటీ చేయబోవడం లేదంటూ వస్తున్న వార్తలను ఖండించారు. ఇది పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు.
Kasani Jnaneswar in Telangana Election
కొందరు కావాలని విష ప్రచారం చేస్తున్నారని, ఇది మంచి పద్దతి కాదన్నారు. బుధవారం స్వయంగా తాను తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును కలుస్తున్నామని స్పష్టం చేశారు కాసాని జ్ఞానేశ్వర్.
ఇటు తెలంగాణలో అటు ఏపీలో తమ పార్టీకి మంచి బలం ఉందన్నారు. మొత్తం 119 సీట్లలో పోటీ చేసే ఛాన్స్ లేక పోలేదని పేర్కొన్నారు. గతంలో పవర్ లో ఉన్నామన్న విషయం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు.
తమ పార్టీ చీఫ్ తో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే అంశంపై క్లారిటీ వస్తుందని అన్నారు. ఆ తర్వాత మీడియా వేదికగా తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని అన్నారు కాసాని జ్ఞానేశ్వర్.
Also Read : Nara Bhuvaneshwari : శ్రీవారి సన్నిధిలో భువనేశ్వరి