Eatala Rajender : ప్రాజెక్టుల నిర్మాణం అవినీతికి అందలం
మాజీ మంత్రి ఈటల రాజేందర్ కామెంట్స్
Eatala Rajender : భూపాలపల్లి జిల్లా : మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు. ప్రపంచంలోనే టాప్ ప్రాజెక్టు అంటూ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి గొప్పలు చెప్పారని కానీ ఇవాళ అందులో అంతులోని అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయనేది తేలి పోయిందని ఆరోపించారు. మంగళవారం భూపాలపల్లి జిల్లా లక్ష్మి బ్యారేజ్ కుంగి పోయిన దానిని స్వయంగా పరిశీలించారు ఈటల రాజేందర్. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు ఈటల రాజేందర్.
Eatala Rajender Slams BRS Govt
మేడిగడ్డ సుందిళ్ళ అన్నారం ప్రాజెక్ట్స్ తెలంగాణ రైతాంగానికి నీళ్లు ఇచ్చి కాపాడతాయి అనుకున్నామని , కానీ రైతుల పాలిట శాపంగా మారాయని ఆరోపించారు. స్వయంగా కేసీఆర్ నా మెదడంతా కరిగించి ఇంజనీర్లకే సూచనలు ఇచ్చి కట్టించిన అన్నారని ఇప్పుడేమైందని ప్రశ్నించారు. మొన్నటికి మొన్న వరదలు వచ్చిన సమయంలో ఈ బ్యారేజ్ పూర్తిగా కుంగి పోయిందన్నారు.
ఇవాళ ఎలాంటి వర్షాలు , వరదలు రాలేదని, కానీ మేడిగడ్డ బ్యారేజ్ కుంగి పోవడం దారుణమన్నారు ఈటల రాజేందర్(Eatala Rajender). కాంక్రీట్ గోడలు పడిపోయి, మోటర్లు ధ్వంసం అయ్యాయయని మండిపడ్డారు. అయినా.. ప్రజల డబ్బుతో కట్టిన వీటిని సందర్శించేందుకు ప్రతిపక్షాలను ఎందుకు వెళ్ల నీయడం లేదని మండిపడ్డారు. ఓ వైపు మునిగి పోతుంటే ఎలా రైతులకు నీళ్లు ఇస్తారో సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read : Daggubati Purandeswari : ఏపీ సర్కార్ పై పురందేశ్వరి ఫైర్