MLC Kavitha : ఆక్స్ ఫర్డ్ లో ప్రసంగించనున్న కవిత
లండన్ కు బయలు దేరిన ఎమ్మెల్సీ
MLC Kavitha : హైదరాబాద్ – ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక యూనివర్శిటీలలో ఒకటిగా గుర్తింపు పొందింది లండన్ లోని ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ. ఈ విశ్వ విద్యాలయంలో ప్రసంగించే అరుదైన ఛాన్స్ దక్కించుకుంది భారత జాగృతి సంస్థ చీఫ్ , బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
MLC Kavitha in London Tour Viral
బతుకమ్మ పేరు చెబితే ముందుగా గుర్తుకు వచ్చేది కవితనే. తెలంగాణ ఉద్యమ సమయంలో బతుకమ్మ పండుగకు ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా చేసింది. ఇవాళ బతుకమ్మను ప్రతి చోటా ఆదరిస్తున్నారు. ఆ సంస్కృతిని వంట పట్టించుకున్నరు.
ఒకప్పుడు తెలంగాణ సంస్కృతి అంటే చీదరించుకునే వాళ్లు. హేళన చేస్తూ , ఎగతాళి చేసే వాళ్లు. కానీ సీన్ మారింది. టీఆర్ఎస్ పవర్ లోకి వచ్చింది. ఇవాళ సినిమా రంగాన్ని తెలంగాణకు చెందిన కవులు, రచయితలు, కళాకారులు, నటీ నటులు, ఇతర సాంకేతిక నిపుణులు, దర్శక, నిర్మాతలు దుమ్ము రేపుతున్నాయి.
ఇదంతా రాష్ట్రం ఏర్పాటు కావడం వల్లనే సాధ్యమైందన్నది వాస్తవం. మొత్తంగా ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో తెలంగాణ సర్కార్ సాధించిన ప్రగతి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, బతుకమ్మ విశిష్టత గురించి ప్రసంగించనుంది కవిత(MLC Kavitha). ఇందుకోసం ఆమె లండన్ కు బయలు దేరారు.
Also Read : K Raghavendra Rao : రాఘవేంద్రరావు బాబు జపం