Rahul Gandhi : విజయనగరం రైలు ఘటన బాధాకరం
ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ
Rahul Gandhi : న్యూఢిల్లీ – విజయనగరం జిల్లాలో ప్యాసింజర్ రైలును ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఢీకొంది. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఏపీ సర్కార్ బాధితులకు వైద్య సౌకర్యాలను కల్పిస్తోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి వెంటనే స్పందించారు. ఈ రైలు ఘటనపై దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు ప్రతిపక్ష నాయకుడు, ఏఐసీసీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పందించారు.
Rahul Gandhi Comment on Train Incident
ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంగా క్షతగాత్రులు, బాధితులకు , వారి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు సహాయ సహకారాలు అందించాలని రాహుల్ గాంధీ కోరారు.
ఇదిలా ఉండగా రైలు ఘటనతో కేంద్ర రైల్వే శాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు రైల్వే సమాచారం అందజేస్తోంది. ఈ ఏడాది రైల్వే శాఖ ఆధ్వర్యంలో పలు రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి.
Also Read : Bandla Ganesh : బాబు కోసం చచ్చేందుకు సిద్దం