Rahul Gandhi : న్యూఢిల్లీ – ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మరోసారి కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానంలో కేసు నడుస్తోంది. దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టేందుకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు.
Rahul Gandhi Comments on Phone Tapping
మంగళవారం రాహుల్ గాంధీ(Rahul Gandhi) మీడియాతో మాట్లాడారు. కేంద్రం కావాలని తమ ఫోన్లను ట్యాపింగ్ చేస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మీ ఇష్టం వచ్చినట్లు ట్యాపింగ్ చేసుకోండి అంటూ మండిపడ్డారు . కావాలంటే తన ఫోన్ కూడా మీకే ఇచ్చేస్తానంటూ ప్రకటించారు. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
మీ ఫోన్ ట్యాపింగ్ లకు తాము భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు కేవలం బీజేపీకి, దాని అనుబంధ పార్టీలకు మాత్రమే సాధ్యమవుతాయని పేర్కొన్నారు. ఇవాళ దేశంలోని 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరగున్నాయి. ఈ తరుణంలో రాహుల్ తో పాటు మరికొందరు కాంగ్రెస్ సీనియర్లు బిజీగా మారారు. ఆయా రాష్ట్రాలలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
ఈసారి తమ సత్తా ఏమిటో చూపించాలని కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఈ తరుణంలో ఫోన్ ట్యాపింగ్ పై రాహుల్ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : Revanth Reddy : డ్రామా రావు నీ ఆటలు సాగవు