Chandrababu Naidu : కోర్టు ఆదేశాలు బేఖాతర్
మీడియాతో మాట్లాడిన టీడీపీ చీఫ్
Chandrababu Naidu : రాజమండ్రి – ఏపీ స్కిల్ స్కామ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైలులో ఉన్న నారా చంద్రబాబు నాయుడుకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్బంగా తుది తీర్పు వెలువరించేంత వరకు సంయమనం పాటించాలని, ఎలాంటి రాజకీయ ప్రసంగాలు, వ్యక్తిగత దూషణలు చేయ కూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు కోర్టు కొన్ని కండీషన్స్ విధించింది చంద్రబాబు నాయుడుకు.
Chandrababu Naidu Viral with his Speech
ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాకు సంబంధించి ఇంటర్వ్యూలు కానీ, మాట్లాడ కూడదని, రెచ్చగొట్టేలా విమర్శలు, ఆరోపణలు చేయొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు వెలువరించిన తీర్పులో పేర్కొన్నారు జడ్జి. కానీ టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎంగా పని చేసిన చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) వాటిని ధిక్కరించారు. తనకు ఎదురే లేదన్నట్టుగా మాట్లాడారు.
మీడియాతో తాను ఏ తప్పు చేయలేదన్నారు. చివరకు ధర్మమే గెలుస్తుందన్నారు. చట్టం ఎవరికైనా ఒక్కటేనని చంద్రబాబు నాయుడు గుర్తించక పోవడం దారుణమని వైసీపీ పేర్కొంది. ఇదిలా ఉండగా కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ తరపు లాయర్లు ఇదే విషయంపై కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం.
Also Read : Chandra Babu Welcome : బాబుకు గ్రాండ్ వెల్ కమ్