Tummala Nageshwara Rao : టీడీపీ కండువాతో తుమ్మల ప్రచారం
విస్తు పోయిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
Tummala Nageshwara Rao : ఖమ్మం జిల్లా – మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు హాట్ టాపిక్ గా మారారు. ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో కీలకమైన నాయకుడిగా ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తనకంటూ ఓ స్వంత కేడర్ ఉంది.
Tummala Nageshwara Rao Viral With TDP Flag
ఉమ్మడి ఏపీలో సత్తా చాటిన తుమ్మల ఉన్నట్టుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో గత్యంతరం లేక గులాబీ కండువా కప్పుకున్నారు. కేసీఆర్ పిలిచి సీటు ఇచ్చినా గెలవలేక పోయారు. చివరకు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు జరుగనున్నాయి.
కాంగ్రెస్ పార్టీ నుంచి పాలేరు టికెట్ ఆశించారు తుమ్మల. కానీ అక్కడ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కేటాయించింది. ఈయనకు ఖమ్మం సీటు ఖరారు చేసింది. దీంతో ఎన్నికల రంగంలోకి దిగారు తుమ్మల నాగేశ్వర్ రావు.
కాంగ్రెస్ కండువా కప్పు కోవాల్సిన తుమ్మల నాగేశ్వర్ రావు(Tummala Nageshwara Rao) తెలుగుదేశం పార్టీ కండువాతో దర్శనం ఇచ్చారు. దీంతో హస్తం శ్రేణులు తుమ్మల నిర్వాకం చూసి విస్తు పోయారు. తనలో ఇంకా పసుపు రక్తం ఉందని చూపే ప్రయత్నం చేశారా లేక కావాలనే ఇలా చేశారా అనేది చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా తుమ్మల వైరల్ కావడం విశేషం.
Also Read : Chandrababu Naidu : కోర్టు ఆదేశాలు బేఖాతర్