Arvind Kejriwal : ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా
మధ్య ప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి
Arvind Kejriwal : న్యూఢిల్లీ – ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ ముందు విచారణకు హాజరు కావాల్సిన ఆప్ బాస్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డుమ్మా కొట్టారు. తనకు ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉన్నందున తాను హాజరు కాలేక పోతున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే భారీ భద్రత మధ్య గురువారం వెళ్లి పోయారు. దీంతో తనను ముందస్తుగా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందంటూ ఆ పార్టీకి చెందిన మంత్రి అతిషి సంచలన ఆరోపణలు చేశారు.
Arvind Kejriwal Liquor Scam Issue Viral
దీంతో ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఏం జరగబోతోందనే దానిపై పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆప్ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంకా జైలులోనే ఉన్నారు.
మరో వైపు ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో కీలక నాయకురాలు, తెలంగాణ సీఎం కూతురు కల్వకుంట్ల కవిత మూడుసార్లు ఈడీ ముందుకు హాజరయ్యారు. తనకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ తరుణంలో అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ను కూడా అరెస్ట్ చేసేందుకు కేంద్రంలో కొలువు తీరిన మోదీ, బీజేపీ సర్కార్ ప్లాన్ చేస్తోందంటూ ఆప్ ఆరోపిస్తోంది. ఏది ఏమైనా అరవింద్ అరెస్ట్ అవుతారా లేక ముందస్తు బెయిల్ తెచ్చుకుంటారా వేచి చూడాలి.
Also Read : IT Raids : కాంగ్రెస్..బీఆర్ఎస్ నేతలకు ఐటీ షాక్