Chandra Babu Case : బాబు ర్యాలీపై కేసు నమోదు
ఎన్నికల వేళ కోడ్ ఉల్లంఘన
Chandra Babu Case : హైదరాబాద్ – ఏపీ స్కిల్ స్కాం కేసులో అడ్డంగా బుక్కై రిమాండ్ ఖైదీగా 53 రోజుల పాటు రాజమండ్రి జైలులో ఉన్నారు. కంటి శస్త్ర చికిత్స నిమిత్తం నాలుగు వారాల పాటు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో రాజమహేంద్ర వరం నుంచి హైదరాబాద్ కు విచ్చేశారు. ఈ సందర్బంగా భారీ ర్యాలీ చేపట్టారు నగరంలో.
Chandra Babu Case Filed by Hyd Police
నిత్యం తమ అవసరాల కోసం ప్రయాణం చేసే పాదచారులు, వాహనదారులు, ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న రిజల్ట్స్ ప్రకటించనుంది ఈసీ.
ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఎవరూ ,ఏ పార్టీకి చెందిన వారు ర్యాలీలు తీయకూడదు. ఒకవేళ తీయాలని అనుకుంటే ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు(Chandra Babu) దీనిని ఫాలో కాలేదు. తాను మాజీ సీఎం అన్న ధీమాతో ముందుకు వెళ్లారు.
టీడీపీ శ్రేణులు ర్యాలీ చేపట్టడాన్ని ఈసీ తీవ్రంగా పరిగణించింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉండడంతో ఆ పార్టీ జనరల్ సెక్రటరీ జీవీజీ నాయుడుతో సహా పలువురిని కేసులో చేర్చారు. ఇప్పటికే పలు కేసులలో ఇరుక్కున్నారు చంద్రబాబు నాయుడు. వ్యవస్థలను మ్యానేజ్ చేస్తూ వచ్చారంటూ వైసీపీ ఆరోపించింది.
Also Read : TPCC Chief : ఐటీ దాడులకు భయపడం