Rakesh Reddy : గులాబీ గూటికి రాకేశ్ రెడ్డి
కేటీఆర్ సమక్షంలో చేరిక
Rakesh Reddy : హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీకి గుడ్ బై చెప్పిన ఆ పార్టీ సీనియర్ నేత రాకేశ్ రెడ్డి ఎట్టకేలకు గులాబీ గూటికి చేరుకున్నారు. ఆయనను స్వయంగా ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి.
Rakesh Reddy Joined in BRS
హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఐటీ, పురపాలిక శాఖ మంత్రి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ గత 11 ఏళ్లకు పైగా నిబద్దత కలిగిన నాయకుడిగా రాకేశ్ రెడ్డి గుర్తింపు పొందారని ప్రశంసించారు.
ఆయన చేరికతో తమ పార్టీకి మరింత బలం చేకూరినట్లయిందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఏనుగుల రాకేశ్ రెడ్డి బీజేపీలో సీనియర్ నాయకుడు. ఆయన అమెరికాలో భారీ వేతనంతో కూడిన జాబ్ ను కాదనుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం బీజేపీలో చేరారు. అంచెలంచెలుగా ఆ పార్టీలో ఎదిగారు.
పార్టీ తరపున తన వాయిస్ ను, ప్రజల గొంతుకను వినిపించారు. పార్టీ అధికార ప్రతినిధిగా గుర్తింపు పొందారు. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఆగడాలను ఎండగట్టారు. చివరకు ఆ పార్టీ గూటికి చేరడం విస్తు పోయేలా చేసింది.
Also Read : Revanth Reddy : కాళేశ్వరంపై విచారణ చేపట్టాలి