PM Modi Visit : తెలంగాణ‌పై మోదీ ఫోక‌స్

7,11 తేదీల‌లో స‌భ‌లు

PM Modi Visit : తెలంగాణ – ప్ర‌స్తుతం అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌డంతో ఎలాగైనా ప‌వ‌ర్ లోకి రావాల‌ని ప్ర‌య‌త్నం చేస్తోంది భార‌తీయ జ‌న‌తా పార్టీ. ఇప్ప‌టికే ఆ పార్టీ కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. ప్ర‌ధానంగా బీఆర్ఎస్ కు పోటీదారుగా నిలిచేలా పార్టీని తీర్చిదిద్దిన బీజేపీ చీఫ్ , ఎంపీ బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ ను మార్చేసింది. ఆయ‌న సేవ‌లు దేశ వ్యాప్తంగా అవ‌స‌ర‌మ‌ని భావించింది. పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది.

PM Modi Visit to Telangana

ఇదే స‌మ‌యంలో సౌమ్యుడిగా పేరు పొందిన కేంద్ర మంత్రి జి. కిష‌న్ రెడ్డికి రాష్ట్ర బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఆయ‌న‌పై న‌మ్మ‌కం ఉంచిన పార్టీ విస్తృతంగా ఎన్నిక‌ల్లో ప్లాన్ చేసింది. ఈ మేర‌కు బీసీ నినాదాన్ని ముందుకు తీసుకు వ‌చ్చింది. తాము గ‌నుక అధికారంలోకి వ‌స్తే బీసీకి చెందిన వ్య‌క్తికి సీఎం పోస్ట్ ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది.

దీంతో తెలంగాణ రాష్ట్రంలో అత్య‌ధిక ఓటు బ్యాంకు క‌లిగిన సామాజిక వ‌ర్గంగా వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల కులాల‌కు చెందిన వారున్నారు. వీరి ఓట్లు త‌మ‌కు రానున్నాయ‌ని అంచ‌నా వేస్తోంది ఆ పార్టీ. ఇదిలా ఉండ‌గా ఈనెల 7న , 11న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi) తెలంగాణ‌లో జ‌రిగే బ‌హిరంగ స‌భ‌ల్లో పాల్గొంటార‌ని ఆ పార్టీ తెలిపింది. పార్టీ నేత‌లు, శ్రేణులు భారీగా పాల్గొని విజ‌య‌వంతం చేయాల‌ని పిలుపునిచ్చింది.

Also Read : G Kishan Reddy : కాళేశ్వ‌రం అవినీతిమయం

Leave A Reply

Your Email Id will not be published!