Congress Third List : ఆ సీట్ల‌పై తెగ‌ని పంచాయ‌తీ

16 సీట్లతో మూడో జాబితా వెల్ల‌డి

Congress Third List  : తెలంగాణ ఎన్నిక‌ల సంద‌ర్బంగా కాంగ్రెస్ పార్టీ(Congress) మూడో విడ‌త జాబితాను ప్ర‌క‌టించింది. తొలి విడ‌త‌లో 55 సీట్లు ఖ‌రారు చేస్తే, రెండో లిస్టులో 45 మందిని ఖ‌రారు చేసింది పార్టీ. థ‌ర్డ్ లిస్టులో 16 మందికి ఛాన్స్ ఇచ్చింది. ఇంకా మిగలిన మూడు సీట్ల‌పై అభ్య‌ర్థుల ఎంపిక త‌ల‌కు మించిన భారంగా మారింది. ఢిల్లీలో ఎన్నిక‌ల స్క్రీనింగ్ కమిటీ క‌స‌ర‌త్తు చేస్తోంది.

Congress Third List Released

విచిత్రంగా మాజీ మంత్రి డాక్ట‌ర్ జిల్లెల చిన్నారెడ్డికి కోలుకోలేని షాక్ ఇచ్చింది పార్టీ. ఆయ‌న స్థానాన్ని మార్చేసింది. చిన్నారెడ్డికి బ‌దులు మేఘా రెడ్డిని ప్ర‌క‌టించింది. అక్క‌డ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున చిన్నారెడ్డి అభ్య‌ర్థిత్వాన్ని ఒప్పుకోలేదు.

మొత్తం నాలుగు స్థానాల‌కు గాను మూడు స్థానాల‌పైనే తీవ్ర‌మైన పోటీ నెల‌కొంది. ఈ మూడు ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన‌వే కావ‌డం విశేషం. ఇందులో తుంగ‌తుర్తి, సూర్యాపేట‌, మిర్యాల‌గూడ స్థానాలు ఉన్నాయి.

భారీ ఎత్తున క‌స‌ర‌త్తు చేస్తోంది ఎన్నిక‌ల స్క్రీనింగ్ క‌మిటీ. కానీ ఇంకా కొలిక్కి రాలేదు. ఈనెల 10వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు ఛాన్స్ ఉంది. విచిత్రం ఏమిటంటే రేవంత్ రెడ్డి, వెంక‌ట్ రెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి త‌మ వారికి టికెట్లు కావాలంటూ ప‌ట్టు ప‌డుతున్నారు.

Also Read : Kodanararam : కాళేశ్వ‌రం నిర్మాణ లోపం

Leave A Reply

Your Email Id will not be published!