TTD Chairman : ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన
TTD Chairman : తిరుమల – తిరుచానూరులో తిరుమల తరహాలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం మంగళవారం ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. అమ్మ వారి వాహన సేవలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అమ్మ వారి బ్రహ్మోత్సవాలకు ముందుగా తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు.
TTD Chairman in TTD Program
ఈనెల 9న అంకురార్పణ, 10న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. 14న అమ్మవారికి అత్యంత ప్రీతి పాత్రమైన గజవాహన సేవకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎక్కువ మంది భక్తులు దర్శించుకునేలా అధికారులు చక్కటి ప్రణాళికల్ని రూపొందించారని తెలిపారు.
18న పంచమి తీర్థానికి విశేషంగా భక్తులు తరలివచ్చి కోనేరులో పుణ్యస్నానాలు చేస్తారని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. దాదాపు రూ.9 కోట్లతో పంష్కరిణిని ఆధునీకరించి నీటితో నింపారని వెల్లడించారు భూమన కరుణాకర్ రెడ్డి(TTD Chairman).
అమ్మ వారి ఆలయానికి చైర్మన్ కరుణాకర రెడ్డి చేతుల మీదుగా భక్తులు 15 పరదాలను విరాళంగా అందించారు. హైదరాబాదుకు చెందిన శ్రీ స్వర్ణ కుమార్ రెడ్డి 11, గుంటూరుకు చెందిన అరుణ్ కుమార్, పద్మావతి, తిరుచానూరుకు చెందిన పవిత్ర, రజిని ఒక్కొక్కటి చొప్పున నాలుగు పరదాలను విరాళంగా అందజేశారు.
Also Read : Kata Sudha Srinivas Goud : కోట్లకు టికెట్ అమ్ముకున్నారు