BJP 4th List : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సందర్బంలో మంగళవారం బీజేపీ నాలుగో విడత జాబితా విడుదల చేసింది. ఇప్పటి వరకు మొత్తం 100 స్థానాలను ఖరారు చేసింది. ఈ ఎన్నికల్లో జనసేన, బీజేపీ(BJP) కలిసి కొన్ని సీట్లలో పోటీ చేయనున్నాయి. ఈ మేరకు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
BJP 4th List Released
4వ విడత ప్రకటించిన లిస్టులో 12 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిగా వడ్డేపల్లి సుభాష్ కు , మునుగోడు నుంచి చలమల్ల కృష్ణా రెడ్డి, చెన్నూరు నుంచి దుర్గం అశోక్ , వేముల వాడ నియోజకవర్గంలో తుల ఉమకు కేటాయించారు.
హుస్నాబాద్ నుంచి శ్రీరాం చక్రవర్తి, సిద్దిపేట నుంచి దొడ్డి శ్రీకాంత్ రెడ్డి, వికారాబాద్ నుంచి నవీన్ కుమార్ , కోడంగల్ నుంచి రమేష్ కుమార్ , గద్వాల్ నుంచి బోయ శివ, మిర్యాలగూడ నుంచి సాధినేని శ్రీనివాస్, నకిరేకల్ నుంచి మొగులయ్య, ములుగు నుంచి అజ్మీర్ ప్రహ్లాద్ నాయక్ ను ప్రకటించింది.
మొత్తంగా చూస్తే బీసీ నినాదంతో ముందుకు వెళుతోంది భారతీయ జనతా పార్టీ.
Also Read : TTD Chairman : ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం