AP CM YS Jagan : రైతు భరోసా కింద రూ. 2,204.77 కోట్లు
జమ చేసిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి
AP CM YS Jagan : శ్రీ సత్యసాయి జిల్లా – రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో జరిగిన రైతు భరోసా పంపిణీ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
AP CM YS Jagan Ruling
ఈ సందర్బంగా కీలక ప్రసంగం చేశారు. గతంలో వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేశారని ఆవేదన చెందారు. కేవలం తమ ఆస్తులను కూడ బెట్టుకునేందుకే సమయం కేటాయించారని, సామాన్యుల బాధలు పట్టించు కోలేదన్నారు జగన్ రెడ్డి.
ఇదిలా ఉండగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి వైఎస్సార్ రైతు భరోసా రెండో విడత కింద పెట్టుబడి సాయాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు ఏపీ సీఎం. ఈ మేరకు ఒక్కో రైతుకు ర. 4,000 చొప్పున 53.53 లక్షల మంది రైతులకు రూ. 2, 204.70 కోట్లను రైతు భరోసా కింద సాయం వారి ఖాతాల్లో జమ చేశామని స్పష్టం చేశారు జగన్ మోహన్ రెడ్డి(AP CM YS Jagan). ఈ మొత్తాన్ని సీఎం బటన్ నొక్కి డబ్బులు జమ చేశారు.
రైతులకు పంట సాయంతో పాటు మరింత తోడ్పాటు అందజేస్తున్నామని, సాగు చేసేందుకు అవసరమైన పనిముట్లను కూడా అందజేస్తున్నట్లు చెప్పారు ఏపీ సీఎం. తమ సర్కార్ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
Also Read : Vijay Sai Reddy : ఏం కూతురివమ్మా నీవు