DK Shivakumar : పునరాలోచనలో ట్రబుల్ షూటర్
ప్రచారానికి వద్దంటున్న నేతలు
DK Shivakumar : హైదరాబాద్ – కర్ణాటకలో కీలకమైన నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పునరాలోచనలో పడ్డారా. అవుననే అంటున్నారు తన అనుచరులు. ఆయన ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న శాసన సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు.
DK Shivakumar Comments Viral
పార్టీ హైకమాండ్ భారీ ఎత్తున ప్రచారానికి తెర తీసింది. దేశంలో ప్రస్తుతం 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ అభ్యర్థుల ఎంపిక దగ్గరి నుంచి ఎవరిని కేబినెట్ లోకి తీసుకోవాలనే దానిపై కూడా కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.
ఇందులో భాగంగా డీకే శివకుమార్(DK Shivakumar) తెలంగాణలో పార్టీ పరంగా ప్రచారం చేసేందుకు డిసైడ్ అయ్యారు. హైదరాబాద్ లోని తుక్కుగూడలో, తాండూరులో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. కర్ణాటకలో తాము 5 గంటల పాటు కరెంట్ ఇస్తున్నామంటూ చెప్పారు. దీనిపై పెద్ద ఎత్తున రాద్ధాంతం చోటు చేసుకుంది.
దీంతో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల అభ్యర్థులు దయచేసి డీకేఎస్ రావద్దంటూ కోరుతున్నారు. విచిత్రం ఏమిటంటే అనువాదం చేసే నేతలు సైతం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుండడం విశేషం. రేవంత్ రెడ్డి సీఎం అవుతారని అనకున్నా అలా అన్నారంటూ చెప్పడంపై రాద్దాంతం చోటు చేసుకుంది.
Also Read : V Hanumantha Rao : పవన్ కామెంట్స్ వీహెచ్ సీరియస్