TPCC Chief : హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ మధ్యన ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ఆతీయ ఛానల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చర్చా గోష్టిలో ఆయన మాట్లాడారు. విచిత్రం ఏమిటంటే రైతుల నుంచి 50 వేల ఎకరాలు తీసుకుని అమరావతి లాంటి సిటీని నిర్మిస్తామని అన్నారు. దీని వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బ్రోకర్లు, కమీషన్ దారులు, ఎమ్మెల్యేలు, మంత్రులకు లాభం కలగడం తప్ప ఇంకేమీ ఉండదన్న ఆలోచన లేకుండా మాట్లాడటం విస్తు పోయేలా చేసింది.
TPCC Chief Comment
ఇది పక్కన పెడితే యువతకు ఎలాంటి ఉపాధి చూపిస్తామంటే హైదరాబాద్ చుట్టు పక్కల పెద్ద ఎత్తున కూరగాయలు పండిస్తారని, రోడ్డు మీద అమ్ముకోకుండా ఉన్న చోటనే ఉపాధి కల్పించేలా చూస్తామన్నారు. మూసీ నది చుట్టూ యువతకు 24 గంటలలో రోజుకు 3 షిఫ్టుల చొప్పున కూరగాయలు అమ్ముకునేలా ఉపాధి చూపిస్తామని చెప్పారు. దీని వల్ల సర్కార్ కు ఆదాయం కూడా లభిస్తుందన్నారు రేవంత్ రెడ్డి.
తాజాగా టీపీసీసీ(TPCC Chief ) చీఫ్ చేసిన కామెంట్స్ పై నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఖాళీలు ఉంటే వాటి గురించి మాట్లాడకుండా కూరగాయలతో ఉపాధి చూపిస్తామనడం ఎంత వరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు.
Also Read : Ponguleti Srinivas Reddy : ఐటీ దాడులకు భయపడను