AP CID Chief : సోషల్ మీడియా పోస్టులపై నజర్
చర్యలు తప్పవన్న ఏపీ సీఐడీ చీఫ్
AP CID Chief : అమరావతి – అత్యుత్సాహంతో, రేటింగ్ రావాలనే నెపంతో , ఒకే రోజు పాపులర్ కావాలనే దుగ్ధతో ఉన్నట్టుండి సోషల్ మీడియాలో వైరల్ కావాలని అనుకునే వాళ్లకు కోలుకోలేని షాక్ ఇచ్చారు ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్. ఆయన మీడియాతో మాట్లాడారు. గత కొంత కాలం నుంచి సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎవరు పోస్టులు పెడుతున్నారనే దానిపై ఆరా తీస్తున్నామని, ఇప్పటికే తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు.
AP CID Chief Comment on Social Media Posts
వీరికి నోటీసులు కూడా పంపించామని చెప్పారు. ప్రధానంగా అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ, సీఎం జగన్ , ఆయన కుటుంబీకులు, మంత్రులు, ఎమ్మెల్యేలపై అనుచిత పోస్టులు పెట్టారని తెలిపారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలకు సంబంధించిన పార్టీల నేతలపై కూడా వ్యతిరేకంగా పోస్టులు షేర్ చేసినట్లు తాము గుర్తించడం జరిగిందన్నారు.
ఇక నుంచి ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తి లేదని హెచ్చరించారు సంజయ్(AP CID Chief ). ఇప్పటికే తమ సైబర్ క్రైమ్ విభాగం పూర్తిగా ఫోకస్ పెట్టిందని, ఇతర పోలీస్ శాఖలతో అనుసంధానమై తాము శిక్షణ కూడా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు ఏపీ సీఐడీ చీఫ్. ఇక నుంచి ఎవరైనా సరే ఒళ్లు జాగ్రత్త పెట్టుకుని పోస్టులు పెట్టాలని, పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచించారు. లేక పోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Also Read : TPCC Chief : కూరగాయలతో యువతకు ఉపాధి