CM KCR : తెలంగాణ – బీఆర్ఎస్ బాస్ , తెలంగాణ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఆయన ప్రధానంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. తాను పోటీ చేస్తున్న రెండు చోట్ల గెలుపొందడం ఖాయమని జోష్యం చెప్పారు.
CM KCR Comment
నిన్నటి దాకా గజ్వేల్ ప్రజలు తనను అక్కున చేర్చుకున్నారని కొనియాడారు. ఇదే సమయంలో కామారెడ్డి ప్రజలు ఏరికోరి ఇక్కడి నుంచి ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని కోరారని, వారి కోరిక మన్నించి ఇక్కడ బరిలోకి దిగానని చెప్పారు కేసీఆర్(CM KCR).
ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. తాను ఒక్కడినే తెలంగాణ సాధన కోసం బయలు దేరినప్పుడు ఎవరూ లేరన్నారు. ఆ తర్వాత మెల మెల్లగా అందరూ తోడయ్యారని గుర్తు చేసుకున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్ లైన్ తో పోరాటం, ఉద్యమాలు చేశామన్నారు.
తాను దేని కోసమైతే రంగంలోకి దిగానో తాను సాధించి తీసుకు వచ్చానని అన్నారు. జరగబోయే ఎన్నికల్లో గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఇక్కడ తాను విజయం సాధిస్తానని , ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అవుతానని అన్నారు సీఎం కేసీఆర్.
Also Read : N Tulasi Reddy : ఆ ముగ్గురికి ఓటేస్తే బీజేపీకి వేసినట్లే