Yashasvini Reddy : అందరి కళ్లు పాలకుర్తి పైనే
ఎర్రబెల్లికి యశస్వి సవాల్
Yashasvini Reddy : పాలకుర్తి – జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో తనకంటూ ఎదురు లేకుండా చేసుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు పెను సవాల్ ఎదురవుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఆయన గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. ప్రవాస భారతీయురాలైన ఇదే ప్రాంతానికి చెందిన యశస్విని రెడ్డి ఉన్నట్టుండి ఎంట్రీ ఇచ్చారు. ఏకంగా టికెట్ తెచ్చుకున్నారు.
Yashasvini Reddy Comment
పాలకుర్తి చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా భారీ ఎత్తున జనం తరలి వచ్చారు ఆమె నామినేషన్ వేసిన సందర్బంగా. ఈ కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) హాజరయ్యారు. వచ్చిన జనాన్ని చూసి రేవంత్ తో పాటు కాంగ్రెస్ శ్రేణులు ఆశ్చర్యానికి లోనయ్యారు.
పాలకుర్తిలో గత కొంత కాలం నుంచి ఎర్రబెల్లి ఆధిపత్యంలో కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు యశస్విని రెడ్డి రూపంలో కొత్త సవాల్ ఎదురు కానుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు త్రిముఖ పోటీ ఉంటుందని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ప్రభుత్వ వ్యతిరేకత పెరగడంతో బీఆర్ఎస్ కు కొంచెం ఇబ్బందికరంగా మారింది.
ప్రత్యేకించి ప్రజా ప్రతినిధులు, మంత్రులు అనుసరిస్తున్న విధానాలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు, కేసులు, దాడులు ఇవాళ బీఆర్ఎస్ పాలిట శాపంగా మారాయి.
Also Read : Chandrababu Case : బాబు బెయిల్ విచారణ వాయిదా