Nilam Madhu Mudiraj : బీఎస్పీలోకి నీలం మధు జంప్
పటాన్ చెరులో అభ్యర్థిగా పోటీ
Nilam Madhu Mudiraj : హైదరాబాద్ – తెలంగాణలో రాజకీయాలు క్షణం క్షణం మారి పోతున్నాయి. నిన్నటి దాకా నగరంలోని పటాన్ చెరు నియోజకవర్గంలో మంచి పట్టు కలిగిన కాంగ్రెస్ నాయకుడిగా గుర్తింపు పొందిన నీలం మధు ముదిరాజ్ ఉన్నట్టుండి శుక్రవారం బీఎస్పీలోకి జంప్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నీలం మధుకు పటాన్ చెరు నియోజకవర్గం అభ్యర్థిగా జాబితాలో చేర్చింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. కానీ ఈ టికెట్ విషయంపై పెద్ద ఎత్తున రాద్ధాంతం చోటు చేసుకుంది. నీలం మధు ముదిరాజ్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి మద్దతు పలికారు.
Nilam Madhu Mudiraj Joined in BSP Party
మాజీ సీఎం దామోదర రాజ నరసింహ సీరియస్ అయ్యారు. తన అనుంగు అనుచరుడిగా గుర్తింపు పొందిన కాట శ్రీనివాస్ గౌడ్ ను కాదని టికెట్ ఎలా ఇస్తారంటూ మండిపడ్డారు. పార్టీ హైకమాండ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాను రాజీనామా చేస్తానంటూ స్పష్టం చేశారు. దీంతో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే స్పందించారు. రాజ నరసింహకు ఫోన్ చేసి పార్టీ తగు నిర్ణయం తీసుకుంటుందని హమీ ఇచ్చారు.
దీంతో గాంధీ భవన్ కు వెళ్లిన నీలం మధు ముదిరాజ్(Nilam Madhu Mudiraj) కు రిక్త హస్తం ఎదురైంది. తిరిగి నిరాశతో వెళ్లిపోయారు. నిన్న రాత్రి పటాన్ చెరు సీటును శ్రీనివాస్ గౌడ్ కు కేటాస్తున్నట్లు ప్రకటించింది పార్టీ హైకమాండ్. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నీలం మధు బీఎస్పీలోకి జంప్ అయ్యారు. ఇవాళ నామినేషన్ వేసేందుకు ఆఖరు రోజు కావడంతో బీఎస్పీ నుంచి బరిలోకి దిగనున్నారు.
Also Read : Yashasvini Reddy : అందరి కళ్లు పాలకుర్తి పైనే