Revanth Reddy : కామారెడ్డి – సీఎం కేసీఆర్ పనై పోయిందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy). కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట కర్ణాటక సీఎం సిద్దరామయ్య, తెలంగాణ జన సమితి పార్టీ చీఫ్ కోదండరామ్ ఉన్నారు. అనంతరం జరిగిన బీసీ డిక్లరేషన్ బహిరంగ సభలో ప్రసంగించారు రేవంత్ రెడ్డి.
Revanth Reddy Slams KCR
తన కోసం కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేయలేదన్నారు. కేవలం రాష్ట్ర ప్రజల కోసం, కల్వకుంట్ల కాలకేయుల చేతిలో బందీ అయి పోయిన తెలంగాణ రాష్ట్రాన్ని విముక్తం చేయడం కోసం తాను పోటీ చేస్తున్నానని అన్నారు.
రాజకీయం కోసం కాదు రాష్ట్ర భవిష్యత్ కోసం తాను ప్రయత్నం చేస్తున్నానని, ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పక్కా అని తేల్చారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా, బీజేపీ , మోదీ , ఓవైసీ కలిసికట్టుగా వచ్చినా కాంగ్రెస్ విజయాన్ని ఆపలేరన్నారు రేవంత్ రెడ్డి.
తాను సంచలనం కోసం పోటీ చేయడం లేదని, సకల జనుల సంక్షేమం కోసం ఇక్కడికి వచ్చానని చెప్పారు. కోడంగల్ లో , కామారెడ్డిలో తన గెలుపును ఆపడం బీఆర్ఎస్ తరం కాదన్నారు.
Also Read : Tula Uma : డబ్బులు ఉన్నోళ్లకే బీజేపీలో టికెట్లు