DK Shiva Kumar : తెలంగాణ – కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shiva Kumar) సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల సందర్భంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. తాను రాసిన లేఖ బోగస్ అని కొట్టి పారేశారు. దీనికి సంబంధించి ఫిర్యాదు కూడా చేయడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ కావాలని నిరాధార ఆరోపణలు చేయడం జరిగిందన్నారు.
DK Shiva Kumar Comments Viral
తాము చెప్పిన విధంగానే ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. డిసెంబర్ 9న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని జోష్యం చెప్పారు. ఇన్నేళ్లుగా తెలంగాణ పేరుతో మోసం చేసిన కేసీఆర్ ఫ్యామిలీ ఇంటికి వెళ్లడం తప్పదన్నారు.
ఇక తాను నిర్మించుకున్న ఫామ్ హౌస్ లో కల్వకుంట్ల కుటుంబం రెస్ట్ కోవడమే ఇక మిగిలిందన్నారు. తాము ఎవరిపై ఆధారపడడం లేదన్నారు. బీఆర్ఎస్ సర్కార్ చేస్తున్న ప్రచారం నమ్మవద్దని సూచించారు. ఇన్నేళ్ల పాటు అబద్దాలు చెబుతూ వచ్చిన కేసీఆర్ కు సీఎంగా కొనసాగే నైతిక అర్హత లేదన్నారు. ఎవరు డబ్బులు పంచుతున్నారో జనాలకు తెలుసన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ కొనసాగుతోందన్నారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.
Also Read : Eatala Rajender : కేసీఆర్ నయా నిజాం నవాబు